గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేందర్ రెడ్డి
నార్సింగి నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
నార్సింగి:మెదక్ జిల్లా నార్సింగి మండలం పెద్దతాండ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షలు, కాంగ్రెస్ పార్టీ తరఫున మరో రూ.5 లక్షలు.. మొత్తం రూ.10 లక్షల వ్యయంతో ఈ సీసీ రోడ్డును నిర్మించనున్నారు. ఈ పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యెన్నం రాజేందర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.గ్రామాల అభివృద్ధే తమ లక్ష్యమని, నిధులు మంజూరు చేసిన ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ నాయక్, తేజా నాయక్, బాచి స్వామి, రాజేందర్, నరేష్, బీజేపీ నాయకులు అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






