Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రీడలు

బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా-ఏ చిత్తు

162 పరుగుల తేడాతో భారత్-ఏ ఘన విజయం.. ఏడు వికెట్లతో సత్తా చాటిన షామ్స్ ములానీ
LAXMAN
September 25, 2026 · 4 days క్రితం
◉ 4 Views ↗ 0 Shares

పుదుచ్చేరి, సెప్టెంబర్ 25 (నవజ్యోతి ప్రతినిధి):

ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు 162 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి సీఏపీ-సీచెమ్ స్టేడియంలో నాలుగో రోజు 55 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా-ఏ 200 పరుగులకే ఆలౌటైంది. భారత్ బౌలర్లలో షామ్స్ ములానీ మూడు వికెట్లు పడగొట్టగా, మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. తుషార్ దేశ్‌పాండే మూడు, తనుష్ కోటియన్ రెండు వికెట్లు సాధించారు. అన్షుల్ కాంబోజ్ తొలి సెషన్‌లో నాథన్ మెక్‌స్వీనీ, పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆస్ట్రేలియా-ఏ తరఫున ఓ’నీల్ 47 పరుగులు చేశాడు. భారత్-ఏకు చెందిన కుమార కుషాగ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 334, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా-ఏ వరుసగా 171, 200 పరుగులకు ఆలౌటైంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానుంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram