Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

సుతారిపల్లిలో ఘనంగా బాలల గ్రామసభ : సర్పంచ్ మద్దూరి సునీల్

November 14, 2026 · 2 weeks క్రితం
◉ 10 Views ↗ 0 Shares

రామాయంపేట,నవంబర్ 14 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):

బాలల హక్కుల పరిరక్షణ, వారి ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా సుతారిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ మద్దూరి సునీల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన బాలల గ్రామసభలో బాల్య వివాహాలు, బాల కార్మికత్వం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పాఠశాల మధ్యలోనే చదువు మానేయడం (డ్రాప్‌అవుట్స్) వంటి సామాజిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుకు ఆటంకమని, ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. బాలల హక్కులను కాపాడటంతో పాటు వారిపై జరిగే అన్యాయాలను గుర్తించి ధైర్యంగా సంబంధిత పెద్దలకు తెలియజేయాలని వివరించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు, స్వీట్లు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాగి అశోక్, శామార్తి స్వామి, జగ్గ శ్యామల, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram