Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

ఎంపీగా పదేళ్లు… దుబ్బాక ఎమ్మెల్యేగా ఇప్పుడు-అయినా అభివృద్ధిలో శూన్యం

November 13, 2026 · 2 weeks క్రితం
◉ 13 Views ↗ 0 Shares

నార్సింగి:గత పదేళ్ల BRS పాలనలో దుబ్బాకకు జరిగిందేమీ లేదని కాంగ్రెస్ మండల అధ్యక్షులు యెన్నం రాజేందర్ రెడ్డి మండిపడ్డారు.దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్లు మెదక్ ఎంపీగా,ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారని నిలదీశారు.నార్సింగి-చిన్న శంకరంపేట కాల్వలను 10 ఏళ్లు ఎందుకు పూర్తి చేయలేదని, చేగుంట, నార్సింగికి సాగునీరు రాకుండా అడ్డుకుంది BRS వైఫల్యమేనని ఫైర్ అయ్యారు.నార్సింగి మండలాన్ని కాగితాలపై మండలం చేసి రూపాయి ఇవ్వలేదని,పేదవారికి డబుల్ బెడ్ రూమ్ లు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని అదే మా రేవంతన్న ప్రజా ప్రభుత్వంలో 96 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించిన ఘనత చెరుకు శ్రీనివాస్ రెడ్డి దని ఈ సందర్భంగా తెలిపారు.ఇప్పుడు రాజీనామా డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.కల్లిబొల్లి మాటలు మాని అభివృద్ధి కోసం పనిచేయాలని,సీఎం పర్యటనలో నిధులు తీసుకురావడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని తెలిపారు.నీకు దమ్ముంటే రాజీనామా చేస్తానడం కాదు చేసి చూపించాలని సవాల్ విసిరారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram