Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

పశు సంపద పెంచాలి-సింగూరు జలాలు మెదక్ జిల్లాకే-మంత్రి వివేక్ వెంకటస్వామి

November 9, 2026 · 3 weeks క్రితం
◉ 21 Views ↗ 1 Shares

నర్సాపూర్ నవజ్యోతి ప్రతినిధి ముకుంద్
నర్సాపూర్:సింగూరు జలాలను మెదక్ జిల్లా ప్రజల అవసరాల కోసమే వినియోగిస్తామని, పశు సంపదను పెంచి రైతులు అదనపు ఉపాధి పొందాలని కార్మిక, గనుల శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.నర్సాపూర్ మండలం రామచంద్రపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు చికిత్సా అవగాహన కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పశువులకు, గొర్రెలకు గాలి కుంట వ్యాధి నివారణ మందులను వేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్ నినో ఒక ప్రకృతి వైపరీత్యమని, దీనిని అందరం కలిసి ఎదుర్కోవాలన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోయాయని, రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అందరం కలిసి కట్టుగా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.హైదరాబాద్ కు నాలుగు జలాశయాలు ఉండగా మెదక్ కు సింగూరు ఒక్కటే దిక్కని ఎంపీ రఘునందన్ అన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram