Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

శివాలయ యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం..నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్న యువ ఎమ్మెల్యే రోహిత్‌ రావు !

ఆకట్టుకున్న గంగాహారతి.. భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు శివాలయ యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జన శోభాయాత్ర
SAI MANIKANTA
September 28, 2026 · 1 day క్రితం
◉ 2 Views ↗ 0 Shares
Oplus_16908288
మనోహరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (నవజ్యోతి ప్రతినిధి నవీన్‌):

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో శివాలయ యూత్ సభ్యులు వినాయక నిమజ్జన వేడుకలు మనోహరాబాద్ గ్రామంలో ఆదివారం ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందుగా నిర్వహించిన గంగ హారతి పూజ కార్యక్రమం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసింది. గంటకు పైగా నిర్వహించిన గంగా హారతి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కాశీలో చూస్తున్నట్టుగా ఆనందంతో ప్రతి ఒక్కరు పులకరించిపోయారు.

రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, విరితో పాటు జబర్దస్త్ ఫేమ్ నాటినటులు గణనాథుడి శోభాయాత్రలో పాల్గొని సందడి చేశారు.

భక్తిశ్రద్ధలతో గణనాధులకి వీడ్కోలు పలుకుతూ చిన్న పెద్ద తరతమ్యాలు చూపకుండా నృత్యాలతో ఉత్సాహంగా శోభయాత్రలో పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, నటీనటులు,గ్రామస్తులతో కలిసి మాస్ స్టెప్పులు చేస్తూ నృత్యాలతో ఉత్సాహంగా శుభ యాత్రలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ ప్రజలకు సాంస్కృతిక విలువలు, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమంలో ఎంతో గానో ఉపయోగపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో శివాలయం యూత్ సభ్యులు, జబర్దస్త్ ఫేమ్ నాటినటులు,మండల సర్పంచులు, జిల్లా నాయకులు, గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram