షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్‌కు కాంస్య పతకం
17.17 మీటర్ల త్రోతో మూడో స్థానం.. ఆసియా క్రీడల్లో పతకంతో సత్తా చాటిన భారత అథ్లెట్
◉ 5 Views
↗ 0 Shares
నాగోయా, సెప్టెంబర్ 25 (నవజ్యోతి ప్రతినిధి):
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ సత్తా చాటింది. మహిళల షాట్‌పుట్ ఫైనల్లో 17.17 మీటర్ల దూరం ఇనుప గుండును విసిరి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆసియా క్రీడల మహిళల షాట్‌పుట్‌లో పతకం సాధించిన మూడో భారత అథ్లెట్‌గా నిలిచింది. గతంలో బర్బరా వెబ్‌స్టర్ 1951లో, కిరణ్ బలియాన్ 2023లో కాంస్య పతకాలు సాధించారు. తాజాగా మన్‌ప్రీత్ వారి సరసన చేరింది. మరోవైపు పురుషుల 100 మీటర్ల పరుగులో భారత అథ్లెట్లకు నిరాశ ఎదురైంది. సెమీఫైనల్లో గురిందెర్విర్ సింగ్ 10.32 సెకన్లతో ఐదో స్థానంలో నిలవగా, అనిమేశ్ కుజుర్ 10.38 సెకన్లతో ఏడో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో ఇద్దరూ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






