Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
సంగారెడ్డి

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి

అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించి న్యాయం చేయాలి -జిల్లా కలెక్టర్‌కు టీజేఏ నాయకుల వినతి
LAXMAN
September 23, 2026 · 6 days క్రితం
◉ 7 Views ↗ 2 Shares

సంగారెడ్డి సెప్టెంబర్ 22 (నవజ్యోతి) :

సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) నాయకులు కోరారు. ఈ మేరకు టీజేఏ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ సార్, మరియు రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరంపల్లి అశోక్ అధ్యక్షతన టీజేఏ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి: సిద్దిక్ అహ్మద్

టీజేఏ జిల్లా అధ్యక్షులు, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మహ్మద్ సిద్దిక్ అహ్మద్ మాట్లాడుతూ జర్నలిస్టులు తమ వృత్తి బాధ్యతల్లో భాగంగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారని అన్నారు. ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు జర్నలిస్టుల ద్వారా వెలుగులోకి వచ్చి పరిష్కారానికి నోచుకుంటున్నాయని తెలిపారు.

అయితే జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, నివాస సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల జాబితాను రూపొందించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.

ఇండ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని, జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

 

**ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి: ఖలీల్ సాబ్*

 

టీజేఏ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్ సాబ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం ప్రాధాన్యతతో పరిశీలించాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించే అంశంపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన చర్యలను చేపట్టడంతో పాటు, అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు.

వర్కింగ్ జర్నలిస్టులకు భరోసా కల్పించాలి.

 

*టీజేఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరంపల్లి అశోక్ మాట్లాడుతూ..*

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను దశలవారీగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.

ఇండ్ల స్థలాల సమస్య జర్నలిస్టుల కుటుంబాలకు సంబంధించిన ముఖ్యమైన అంశమని, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ముజహిద్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం. మహిపాల్ రెడ్డి, ఎం. అశోక్ బాబు, కార్యవర్గ సభ్యులు ఆహేద్ పటేల్, ఎం. చంద్రారెడ్డి, రామకృష్ణ, కాళీలుద్దీన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram