Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

కామారెడ్డి… పింఛన్ల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు

దళారులను నమ్మి డబ్బులు ఇవ్వొద్దు.. నేరుగా మున్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి అర్హులైన వారికి నేరుగా ఖాతాల్లోకి పింఛన్‌.. చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్‌ హెచ్చరిక
SAI MANIKANTA
September 19, 2026 · 3 days క్రితం
104 Views 3 Shares
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"square_fit":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 (నవజ్యోతి ప్రతినిధి):

‘చేయూత’ పింఛన్ల పథకం పేరుతో పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే దళారులు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్‌ హెచ్చరించారు. పింఛన్‌ ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే మున్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. దళారులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని కోరారు.

పింఛన్ల పంపిణీకి ఎలాంటి దళారులు, మధ్యవర్తుల అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారికే పింఛన్‌ అందుతుందని, పింఛన్‌ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతుందని తెలిపారు. అలాగే అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆన్‌లైన్‌ ఫొటో వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారని పేర్కొన్నారు.

ఎవరైనా పింఛన్‌ ఇప్పిస్తామని డబ్బులు ఆశిస్తే, వారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లేనని చైర్‌పర్సన్‌ తెలిపారు. పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుపెట్టుకుని వ్యాపారం చేసే వారిని ఉపేక్షించబోమన్నారు.

ప్రజలు నేరుగా మున్సిపల్‌ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్ప ఉమారాణి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

­