Saturday, October 31, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
సంగారెడ్డి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసిన తెల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు

విజయదశమి శుభాకాంక్షలు తెలిపి, డివిజన్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 21, 2026 · 1 week క్రితం
◉ 10 Views ↗ 0 Shares

రామచంద్రపురం, అక్టోబర్ 21: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని బుధవారం తెల్లాపూర్ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెల్లాపూర్ డివిజన్‌లో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడానికి సహకారం అందించాలని ఎమ్మెల్యేను కోరారు.

ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram