Saturday, October 31, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రీడలు

భారత మహిళల క్రికెట్‌ జట్టుకు స్మృతి మందాన కెప్టెన్‌

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్థానంలో బాధ్యతలు.. మూడు ఫార్మాట్లలో కొత్త నాయకత్వం
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 7, 2026 · 3 weeks క్రితం
◉ 8 Views ↗ 1 Shares
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 6 (నవజ్యోతి ప్రతినిధి):

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మందానను బీసీసీఐ నియమించింది. ఇప్పటివరకు కెప్టెన్‌గా కొనసాగిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మూడు ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. జట్టు భవిష్యత్‌ ప్రణాళికలు, ఇటీవలి ప్రదర్శనపై గువాహటిలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం అనంతరం మందానను కొత్త కెప్టెన్‌గా ప్రకటించారు. హర్మన్‌ప్రీత్‌తో పాటు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మందాన, ప్రధాన కోచ్‌ అమోల్‌ ముజుందార్‌ సమావేశంలో పాల్గొన్నారు.

వైస్‌ కెప్టెన్‌ నుంచి కెప్టెన్‌గా..
2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మందానకు నాయకత్వంలోనూ అనుభవం ఉంది.

30 ఏళ్ల స్మృతి మందాన ఇప్పటివరకు 9 టెస్టులు, 120 వన్డేలు, 179 టీ20లు ఆడింది. గతంలో భారత జట్టుకు 18 టీ20ల్లో, నాలుగు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు నాయకత్వం వహించి 2024, 2026లో రెండు టైటిళ్లు సాధించింది. భారత జట్టును నడిపించే అవకాశం దక్కడం ఎంతో ప్రత్యేకమైన గౌరవమని మందాన పేర్కొంది.

హర్మన్‌ప్రీత్‌కు కృతజ్ఞతలు
కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అందించిన సేవలను మందాన ప్రత్యేకంగా గుర్తుచేసింది. జట్టును ఎంతో నిబద్ధతతో నడిపించారని, భారత మహిళల క్రికెట్‌ ప్రయాణంలో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొంది.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో భారత మహిళల క్రికెట్‌ జట్టు కొత్త దశలోకి అడుగుపెట్టింది. మూడు ఫార్మాట్లలో స్మృతి మందాన నాయకత్వంలో జట్టు ముందుకు సాగనుంది. ఇప్పటికే అంతర్జాతీయ, దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో నాయకత్వ అనుభవం ఉన్న మందానపై ఇప్పుడు భారత జట్టును మరింత విజయవంతంగా నడిపించే బాధ్యత ఉంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram