మనోహరాబాద్ ( నవజ్యోతి ప్రతినిధి నవీన్):

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహరాబాద్ శుభం గార్డెన్‌లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమంలో యువకులు, నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సుమారు 1,200 మంది రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
సేవా స్ఫూర్తితో యువత భాగస్వామ్యం
తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు తరచూ రక్తం అవసరమయ్యే నేపథ్యంలో, రక్తదానం ప్రాణదానంతో సమానమనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ప్రజాసేవతో అనుసంధానిస్తూ నిర్వహించిన ఈ శిబిరానికి యువత, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రక్తదాతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్‌ఐలు సుభాష్ గౌడ్, గంగరాజు, మధుకర్, కరుణాకర్ రెడ్డి, పోలీసు సిబ్బంది, చిట్కుల మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. పలు గ్రామాల సర్పంచ్‌లు, యువకులు, నాయకులు స్వచ్ఛందంగా హాజరై రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు.
నవజ్యోతి తెలుగు డైలీ
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు