Saturday, October 31, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జగిత్యాల

బాధిత కుటుంబానికి కొండ లక్ష్మణ్ పరామర్శ

జంగా చిన్న గంగయ్య మృతికి సంతాపం..కుటుంబానికి అండగా ఉంటానని భరోసా
LAXMAN
October 8, 2026 · 3 weeks క్రితం
◉ 4 Views ↗ 0 Shares

జగిత్యాల, అక్టోబర్ 8 (నవజ్యోతి ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండలం అనంతరం (రోడ్యాం) గ్రామానికి చెందిన జంగా చిన్న గంగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో కేఎల్ గ్రూప్ అధినేత కొండ లక్ష్మణ్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. గంగయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ వారిని ఓదార్చారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి అండగా నిలుస్తానని తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కొండ లక్ష్మణ్ పరామర్శతో బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం లభించింది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram