Saturday, October 31, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జగిత్యాల

కత్తితో హత్యాయత్నం.. ముగ్గురు నిందితుల అరెస్ట్

దసరా వేడుకల్లో గొడవ.. నిందితులకు రిమాండ్
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 21, 2026 · 1 week క్రితం
◉ 15 Views ↗ 0 Shares

కోరుట్ల, అక్టోబర్ 21 (నవజ్యోతి ప్రతినిధి ముహమ్మద్ ఫిర్దోస్): దసరా పండుగ సందర్భంగా జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ముగ్గురు నిందితులను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన గుద్దేటి రాజేందర్ (43) తన కాలనీలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం నిర్వహించగా, ఈ సందర్భంగా రామ్‌నగర్ కాలనీకి చెందిన కిరణ్ (19), అజయ్ (19)లతో గొడవ జరిగింది.

అక్టోబర్ 21 తెల్లవారుజామున సుమారు 3 గంటలకు కిరణ్, అజయ్‌లు జ్ఞానదీప్ (20)తో కలిసి అర్బన్ కాలనీలోని దుర్గామాత ఆలయం వద్దకు వచ్చి రాజేందర్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలో కిరణ్, అజయ్‌లు రాజేందర్‌ను పట్టుకోగా, జ్ఞానదీప్ కత్తితో దాడి చేశాడు. దీంతో రాజేందర్ ఎడమ భుజం, మెడ ఎడమ వైపు గాయాలయ్యాయి. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా కత్తితో బెదిరించి ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిరణ్, అజయ్, జ్ఞానదీప్‌లను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. పండుగల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ జి. శ్యామ్ రాజ్ తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram