పొగ మంచులో ప్రయాణం నెమ్మదిగా వెళ్ళండి-SI కరుణాకర్ రెడ్డి
వెల్దుర్తి నవ జ్యోతి ప్రతినిధి ముకుంద్:
వెల్దుర్తి:శీతాకాలంలో ఉదయం వేళల్లో దట్టంగా పొగ మంచు కురుస్తుండటంతో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని ఎస్సై కరుణాకర్ రెడ్డి గారు సూచించారు.ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పొగ మంచు ఎక్కువగా ఉండటంతో రోడ్డు సరిగ్గా కనిపించడం లేదని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు.వాహనదారులు వేగంగా వెళ్లకుండా నెమ్మదిగా వెళ్లాలని, హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాలని, ముందు వెళ్తున్న వాహనాలకు తగినంత దూరం పాటించాలని సూచించారు.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, చలికి తగిన దుస్తులు వేసుకోవాలని చెప్పారు. చిన్నారులను స్కూల్కు పంపే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.పొగ మంచులో అనవసర ప్రయాణాలు మానుకోవాలని, తప్పనిసరైతేనే ప్రయాణించాలని, ప్రాణం కంటే సమయం ముఖ్యం కాదని ప్రాణం కంటే విలువైనది ఏది కాదని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని ముందు వాహనాలకి తగినంత దూరం పాటించాలని ఎస్సై కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.






