Saturday, October 31, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
సంగారెడ్డి

మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ సేవలు

పోస్ట్మాస్టర్ జనరల్ విశాలాక్షి
LAXMAN
October 28, 2026 · 3 days క్రితం
◉ 37 Views ↗ 0 Shares

సంగారెడ్డి అక్టోబర్ 28 (నవజ్యోతి ప్రతినిది) : పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా సేవలను విస్తరిస్తున్నట్లు హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఎన్. అర్. విశాలాక్షి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి డివిజన్ కార్యాలయం సాధారణ తనిఖీలో భాగంగా విచ్చేసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన తపాలా సేవలను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. అవసరమైన చోట పోస్ట్ ఆఫీస్ లను స్థాయి పెంచి ఆధునికరించడం, డెలివరీ సెంటర్లు ఏర్పాటు చేసి ఒకే చోట నుండి అన్ని ప్రాంతాలకు డెలివరీ అదే రోజు జరిగేటట్లు చూడడం జరుగుతుందనీ తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాల బట్వాడా, ఆదాయ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన టార్గెట్ లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కష్టపడి పనిచేసిన ఉద్యోగులను గుర్తించి వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని అన్నారు. ఇంటింటికి తపాల సేవలు పొదుపు పథకాలు చేరడానికి గ్రామీణ తపాల ఉద్యోగులు కృషి ఎంత అవసరమని నొక్కి చెప్పారు.ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తపాలా జీవిత బీమా పాలసీల సేకరణలో మొదటి స్థానంలో నిలిచిన కౌడిపల్లి సబ్ పోస్ట్ మాస్టర్ కొర్ర రమేష్, అత్యధిక అకౌంట్లు సాధించిన లింగంపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంజీవయ్యను పోస్ట్మాస్టర్ జనరల్ విశాలాక్షి వారిని శాలువా, బహుమతితో ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పోస్టల్ ఎస్పీ బి. అంబేద్కర్ రాజు, ఏ ఎస్ పి వెంకన్న, పోస్టల్ ఇన్స్పెక్టర్లు రత్నయ్య, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram