తూప్రాన్ : తమ ఇంటి స్థలం తమకు తెలియకుండానే రిజిస్ట్రేషన్!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన
SAI MANIKANTA
September 29, 2026 · 2 hours క్రితం
◉ 19 Views↗ 2 Shares
తూప్రాన్, సెప్టెంబర్ 29 (నవజ్యోతి ప్రతినిధి):
తమకు తెలియకుండా ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపిస్తూ బాధితులు తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌కు చెందిన మాసనూరి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త మాసనూరి భూమయ్య 2012లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పేరుపై ఉన్న 357 గజాల ఇంటి స్థలాన్ని దగ్గరి బంధువు మాసనూరి సత్తమ్మ పేరుపై అప్పటి గ్రామ కార్యదర్శి సహాయంతో 2013లో తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు.
వాస్తవంగా 357 గజాల స్థలం మాత్రమే ఉండగా, 440 గజాలుగా రిజిస్ట్రేషన్ చేయించారని బాధితులు ఆరోపించారు. అనంతరం మాసనూరి రవికుమార్ 220 గజాలను తన పేరుపై, మరో 220 గజాలను తన కుమారుడు భాస్కర్ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. అంతేకాకుండా పక్కనే ఉన్న ఇతరుల స్థలాన్ని కూడా ఆక్రమించి, అనంతరం ఇంటి నిర్మాణం కోసం ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.15 లక్షల రుణం పొందారని ఆరోపించారు.
తమకు తెలియకుండా జరిగిన రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన గ్రామ కార్యదర్శి, సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకుని, అక్రమంగా నమోదైన డాక్యుమెంట్‌ను తొలగించి స్థలాన్ని తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని వారు కోరారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి