Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

నవజ్యోతి ఎఫెక్ట్‌.. స్కూల్‌ దారిలో ప్రమాదానికి చెక్‌!

SAI MANIKANTA
SAI MANIKANTA
September 15, 2026 జనరల్
సమస్యను చూపించింది.. అధికార యంత్రాంగం స్పందించింది.. కొత్త విద్యుత్‌ స్తంభంతో ముప్పు తొలగింది
కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 15 (నవజ్యోతి ప్రతినిధి): ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకువస్తే.. పాలన స్పందిస్తుందనే దానికి సూరారం మరాఠీబస్తీలో విద్యుత్‌ స్తంభం సమస్య పరిష్కారం మరో ఉదాహరణగా నిలిచింది. కేవీఎం స్కూల్‌కు వెళ్లే మార్గంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్‌ స్తంభాన్ని అధికారులు తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు.

⚠️ ‘విరిగిన స్తంభం.. స్కూల్‌ దారిలో ముప్పు!’

మినీ ట్రక్‌ ఢీకొనడంతో విద్యుత్‌ స్తంభం విరిగిపోయి, వైర్లు వంగిపోయి ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. అదే మార్గంలో విద్యార్థులు, పాదచారులు రాకపోకలు సాగించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.

ఈ సమస్యను సెప్టెంబర్‌ 7న నవజ్యోతి ‘విరిగిన స్తంభం.. స్కూల్‌ దారిలో ముప్పు!’ అనే కథనంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

⚡ విద్యుత్‌ శాఖ స్పందన

నవజ్యోతి కథనాన్ని సీరియస్‌గా తీసుకున్న విద్యుత్‌ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. ప్రమాదకరంగా మారిన పాత స్తంభాన్ని తొలగించి కొత్త విద్యుత్‌ స్తంభాన్ని ఏర్పాటు చేశారు.

దీంతో స్కూల్‌ మార్గంలో విద్యార్థులు, స్థానికులు ఎదుర్కొంటున్న ప్రమాద భయం తొలగింది. అధికారులు సకాలంలో స్పందించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

📰 వార్తకు విలువ.. పరిష్కారంతోనే!

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మీడియా బాధ్యత. అదే సమయంలో సమస్యను గుర్తించి అధికారులు స్పందించి పరిష్కరించడం పాలనకు నిదర్శనం.

సమస్యను గుర్తించింది నవజ్యోతి.. స్పందించింది అధికార యంత్రాంగం.. ప్రమాదం తప్పింది ప్రజలకు!

🙏 స్థానికుల కృతజ్ఞతలు

తమ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి కారణమైన నవజ్యోతి యాజమాన్యానికి, వెంటనే స్పందించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసిన విద్యుత్‌ శాఖ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

సమస్య వెలుగులోకి వచ్చింది.. పరిష్కారం దొరికింది!
ప్రజా సమస్యలపై నవజ్యోతి నిరంతర నిఘా