Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

LAXMAN
LAXMAN
September 14, 2026 బిజినెస్

బంగారం, వెండి ధరల్లో మరోసారి తగ్గుదల నమోదైంది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,090గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.490 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,250గా నమోదైంది. ప్రధాన నగరాల్లో ధరలు తెలంగాణలోని హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,090గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,250గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,570గా నమోదైంది. ఏపీలోనూ ఇదే ధర ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,090గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,41,250 కాగా.. 18 క్యారెట్ల ధర రూ.1,15,570గా నమోదైంది. ఇతర నగరాల్లో.. చెన్నై, ముంబై, కోల్‌కతా, కేరళలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090గా ఉంది. ఢిల్లీలో రూ.1,54,240, అహ్మదాబాద్‌లో రూ.1,54,140గా నమోదైంది. దేశవ్యాప్తంగా నగరాలను బట్టి బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ధరలు మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా రోజులో పలుమార్లు మారే అవకాశం ఉంటుంది.