‘వారణాసి’ కోసం 1600 మంది డబ్బింగ్ కళాకారులు!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సాహస చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటిన రాజమౌళి.. ఈసారి మరింత భారీ కాన్వాస్‌తో ప్రపంచ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాదాపు రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో, 50కి పైగా అంతర్జాతీయ, ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంత భారీ స్థాయిలో సినిమాను వివిధ భాషల్లోకి తీసుకెళ్లే విషయంలో రాజమౌళి ప్రత్యేకమైన విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల అనువాదం, డబ్బింగ్ కోసం కృత్రిమ మేధ, స్వర అనుకరణ వంటి సాంకేతికతలను ఉపయోగించడం పెరుగుతోంది. అయితే ‘వారణాసి’ విషయంలో మాత్రం రాజమౌళి ఈ విధానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.





