Friday, November 27, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి ‘గోల్డ్ స్పాట్’.. పాత జ్ఞాపకాలకు కొత్త మెరుపులు

November 25, 2026 · 2 days క్రితం
◉ 2 Views ↗ 0 Shares

భూదాన్ పోచంపల్లి నవంబర్ 25(నవ జ్యోతి ప్రతినిధి): ఒకప్పుడు భారతీయ యువతను విశేషంగా ఆకట్టుకున్న ప్రముఖ శీతల పానీయం ‘గోల్డ్ స్పాట్’ మళ్లీ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. దాదాపు 26 ఏళ్ల క్రితం నిలిచిపోయిన ఈ కూల్‌డ్రింక్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు కోకాకోలా ఇండియా సన్నాహాలు చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
1952లో పార్లే సంస్థ పరిచయం చేసిన గోల్డ్ స్పాట్.. ‘ది జింగ్ థింగ్’ అనే ట్యాగ్‌లైన్‌తో 1980, 1990 దశకాల్లో విశేష ప్రజాదరణ పొందింది. 1993లో కోకాకోలా సంస్థ పార్లే నుంచి ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయగా, 2000 సంవత్సరంలో ఉత్పత్తిని నిలిపివేసింది.
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతూ లో-షుగర్, జీరో-షుగర్ పానీయాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త రూపంలో గోల్డ్ స్పాట్‌ను తీసుకురావాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఈసారి క్యాన్ల రూపంలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram