Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌!

LAXMAN MANNE
LAXMAN MANNE
August 31, 2026 క్రీడలు

దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో భాగంగా సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌కు అనూహ్య పరిస్థితి ఎదురైంది. జట్టు కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడటంతో కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్‌ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. దీంతో భారత దేశవాళీ క్రికెట్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇషాన్‌కు గాయం
మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఈస్ట్‌ జోన్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడ్డాడు. దీంతో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న వైభవ్‌ సూర్యవంశీ వెంటనే సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కీలక సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంత చిన్న వయసులోనే జట్టును నడిపించే అవకాశం వైభవ్‌కు దక్కడం ప్రత్యేకంగా నిలిచింది. కు సారథ్యం ఈస్ట్‌ జోన్‌ జట్టులో భారత జట్టు ప్రధాన పేసర్లు మహమ్మద్‌ షమీ, ముకేశ్‌ కుమార్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు. వారితో పాటు అనుభవజ్ఞులైన పలువురు ఆటగాళ్లను 15 ఏళ్ల వైభవ్‌ మైదానంలో నడిపించడం ఆసక్తికరంగా మారింది. యువ క్రికెటర్‌ నాయకత్వంలో సీనియర్‌ ఆటగాళ్లు ఆడటం దేశవాళీ క్రికెట్‌లో అరుదైన దృశ్యంగా అభిమానులను ఆకట్టుకుంది.