మమితా బైజు అరుదైన రికార్డు.. ‘గోల్డెన్ లెగ్’గా మారిన మలయాళ ముద్దుగుమ్మ!
సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో క్రేజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా మారుతోంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తుండటంతో.. తాజాగా మమితా బైజు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు సినిమాలు.. రూ.200 కోట్లకు పైగా గ్రాస్.. మమితా బైజు నటించిన మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ రూ.300 కోట్లకు పైగా, సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూ.240 కోట్ల మార్క్‌ను దాటినట్లు తెలుస్తోంది. మరో సినిమాతోనూ భారీ కలెక్షన్లు..
నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన మలయాళ చిత్రం ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నట్లు సమాచారం. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.





