Friday, November 27, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీక్

November 23, 2026 · 4 days క్రితం
◉ 6 Views ↗ 0 Shares

చేగుంట నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
చేగుంట: చేగుంట మండలం ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. గ్రామంలోని శివాలయంలో నిర్వహించిన ఈ కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో చేగుంట మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ఉండాలని శివపార్వతులను ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.అర్చకులు వేద మంత్రాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. భక్తులు మంగళసూత్రధారణ ఘట్టాన్ని తిలకించి భక్తి పారవశ్యానికి లోనయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram