బంగారం ధరలకు మళ్లీ రెక్కలు..
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం, డాలర్ బలహీనపడటం వంటి పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు వరుసగా పైకి కదులుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,970కు చేరింది. ఆదివారం ధరతో పోలిస్తే రూ.880 పెరిగింది.
ఇక 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,50,300గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.800 పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడలో రూ.1,22,930గా ఉంది.
ఏపీలో ధరలు ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,970గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,50,300గా, 18 క్యారెట్ల ధర రూ.1,22,930గా నమోదైంది.





