Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నేర వార్తలు

గాంధీ జయంతి రోజున డ్రై డే ఉల్లంఘన!

మంగళ్‌హాట్‌లో పోలీసుల ప్రత్యేక దాడులు - 50.01 లీటర్ల మద్యం స్వాధీనం
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 3, 2026 · 2 months క్రితం
◉ 11 Views ↗ 1 Shares
హైదరాబాద్‌, అక్టోబర్‌ 3 (నవజ్యోతి ప్రతినిధి):

గాంధీ జయంతి సందర్భంగా డ్రై డే అమల్లో ఉన్నప్పటికీ అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న వారిపై మంగళ్‌హాట్‌ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. అనధికారిక బెల్ట్‌ షాపులపై చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ఐదు వేర్వేరు కేసుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

50.01 లీటర్ల మద్యం స్వాధీనం
డ్రై డే నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ – విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు దాడులు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రాహుల్‌ సింగ్‌ (31) వద్ద 5.48 లీటర్లు, ఓం ప్రకాశ్‌ సింగ్‌ (45) వద్ద 25.56 లీటర్లు, అశోక్‌ సింగ్‌ (67) వద్ద 9.12 లీటర్లు (35 బాటిళ్లు), సురేష్‌ సింగ్‌ (38) వద్ద 5.85 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.

డ్రై డే సందర్భంగా ప్రత్యేక నిఘా

గాంధీ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగించారు. అనధికారికంగా మద్యం నిల్వ చేయడం, విక్రయించడం వంటి చర్యలను అడ్డుకునేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

డ్రై డే నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం, నమోదైన కేసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram