Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
అంతర్జాతీయ

ఇరాన్‌ అణు కేంద్రంపై మరో దాడికి ట్రంప్‌ సంకేతాలు!

వాషింగ్టన్‌, అక్టోబర్‌ 17 (నవజ్యోతి ప్రతినిధి):
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 17, 2026 · 1 month క్రితం
◉ 4 Views ↗ 1 Shares
‘పికాక్స్‌ మౌంటైన్‌’ను లక్ష్యంగా చేసుకోవాల్సి రావొచ్చు

వాషింగ్టన్‌, అక్టోబర్‌ 17 (నవజ్యోతి ప్రతినిధి):

ఇరాన్‌ అణ్వాయుధాలను పొందకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా, ఆ దేశ అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న ‘పికాక్స్‌ మౌంటైన్‌’ భూగర్భ కేంద్రంపై దాడి చేయాల్సి రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. గురువారం రాత్రి న్యూస్‌మాక్స్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని సంపాదిస్తే దాన్ని ఉపయోగించే ప్రమాదం ఉందని, అందుకే ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందకుండా చూడాలని అమెరికా భావిస్తోందని పేర్కొన్నారు.

పర్వతం లోపల పటిష్ఠ భూగర్భ కేంద్రం

ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాల్లో ఒకదానికి సమీపంలో, పర్వతం లోతుల్లో పటిష్ఠంగా నిర్మించిన కేంద్రంగా పికాక్స్‌ మౌంటైన్‌ గుర్తింపు పొందింది. ఈ కేంద్రం లక్షలాది టన్నుల పర్వత శిలల కింద ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. దీనిపైనా దాడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, లక్ష్యాన్ని వేగంగా నిర్వీర్యం చేయగలమని అన్నారు.

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో అణుబాంబును ఉపయోగించే ఉద్దేశం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. అణ్వాయుధాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఇరాన్‌లో అమెరికా భూతల సైనిక దళాలను మోహరించే అంశాన్ని కూడా తాను పరిశీలించడం లేదని పునరుద్ఘాటించారు.

ఇరాన్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలు, అణు కేంద్రాలపై దాడికి ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’గా పిలిచే జీబీయూ-43/బీ భారీ సంప్రదాయ బాంబును ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చారా అనే ప్రశ్నకు ట్రంప్‌ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే ఆ బాంబు అణుబాంబు కాదని చెప్పారు. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులతో ప్రారంభమైన ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram