టీఎంసీ పేరు – గుర్తు ఫ్రీజ్.. బెంగాల్ ఉప ఎన్నికలకు ఈసీ కీలక నిర్ణయం !
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు – ఎన్నికల గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీపై ఆధిపత్యానికి సంబంధించి మమతా బెనర్జీ – అరూప్ రాయ్ వర్గాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 1
ఈసీ ఉత్తర్వుల ప్రకారం రెండు వర్గాలూ ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరును, పార్టీకి రిజర్వ్ చేసిన ‘ఫ్లవర్స్ అండ్ గ్రాస్’ గుర్తును ప్రస్తుత ఉప ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించకూడదు. వివాదంపై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 2
పార్టీ నియంత్రణపై ఉన్న వివాదాన్ని ఎన్నికల గుర్తుల కేటాయింపు ఉత్తర్వుల పేరా 15 కింద ఈసీ పరిశీలించనుంది. అప్పటివరకు మమతా బెనర్జీ వర్గం – అరూప్ రాయ్ వర్గం వేర్వేరు పేర్లు – గుర్తులతో ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. 3
రెండు వర్గాలు సెప్టెంబర్ 18 ఉదయం 11 గంటల్లోగా తమకు కావాల్సిన మూడు పేర్లను ప్రాధాన్యతా క్రమంలో, మూడు ఉచిత ఎన్నికల గుర్తుల ఎంపికలను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. వాటిలో ఒక్కో వర్గానికి ఒక పేరును ఈసీ ఆమోదించి, ఉచిత గుర్తుల జాబితా నుంచి వేర్వేరు గుర్తులను కేటాయించనుంది.






