Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
హైదరాబాద్

భారత్‌–వెస్టిండీస్‌ టీ20 మ్యాచ్‌కు పటిష్ఠ భద్రత!

2,200 మంది పోలీసులతో బందోబస్తు.. 408 సీసీ కెమెరాలతో నిఘా
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 13, 2026 · 2 months క్రితం
◉ 13 Views ↗ 1 Shares

హైదరాబాద్, అక్టోబర్ 13 (నవజ్యోతి ప్రతినిధి): ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో అక్టోబర్‌ 14న రాత్రి 7 గంటలకు జరగనున్న భారత్‌–వెస్టిండీస్‌ నాలుగో టీ20 మ్యాచ్‌కు మల్కాజిగిరి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌ సందర్భంగా 2,200 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించారు.

2,200
పోలీసు సిబ్బంది
408
సీసీ కెమెరాలు
డ్రోన్లు
నిరంతర నిఘా

పలు విభాగాలతో భద్రతా చర్యలు

స్టేడియం, పరిసర ప్రాంతాల్లో 408 సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నిర్వహణ, షీ టీమ్స్‌, బాంబు డిటెక్షన్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌ సిబ్బందిని భద్రతా విధుల్లో భాగస్వాములను చేశారు.

ప్రేక్షకుల భద్రతకు ప్రాధాన్యం

మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు, మహిళలు, చిన్నారులు, క్రీడాకారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల సూచనలు పాటించాలి

మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులు పోలీసుల సూచనలు పాటించాలని, భద్రతా సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు. మ్యాచ్‌ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నవజ్యోతి తెలుగు డైలీ
భారత్‌ vs వెస్టిండీస్‌ | టీ20

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram