Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నల్గొండ

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి…

November 8, 2026 · 3 weeks క్రితం
◉ 6 Views ↗ 0 Shares

నల్గొండ, నవంబర్ 08 (నవజ్యోతి ప్రతినిధి) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చిత్తలూరు గ్రామానికి ప్రత్యేక స్థానం ఉందని సీపీఐ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ అన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం చిత్తలూరులో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక ప్రదర్శన నిర్వహించి, స్మారక స్తూపంపై ఎర్రజెండాను ఆవిష్కరించి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. జీతగాండ్ల సమ్మెలు, సారా వ్యతిరేక పోరాటాలు, కూలీ రేట్ల పెంపు, భూ పోరాటాల్లో వారు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అమరవీరుల ఆశయాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి, నాయకులు గజ్జి రవి, సిలువేరు జానయ్య, పుట్ట సత్తయ్య, మామిడోజు వెంకటేశ్వర్లు, బీవీ చారి, యల్లాముల సైదులు, సుంకరి సీతయ్య, గుగ్గిళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram