Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నల్గొండ

రగ్బీ పోటీల్లో నల్గొండ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం

November 7, 2026 · 3 weeks క్రితం
◉ 8 Views ↗ 0 Shares

నల్గొండ, నవంబర్ 07 (నవజ్యోతి ప్రతినిధి) ఖేలో ఇండియా అస్మిత రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు – 2026 నల్గొండ జిల్లా జట్టు అండర్‌ – 15, అండర్‌ – 18 విభాగాల్లో ద్వితీయ స్థానం సాధించి ప్రతిభ చాటింది. ఈ నెల 4, 5వ తేదీల్లో సంగారెడ్డి జిల్లాలోని వాక్సెన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పోటీల్లో తుమ్మడం బీసీ సంక్షేమ, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థినులు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.లలిత విద్యార్థినులను, వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు కనకదుర్గను అభినందించారు. అలాగే చర్లపల్లి ఏకలవ్య పాఠశాలలో నిర్వహించిన అండర్‌ – 14, అండర్‌ – 17 నెట్‌బాల్ జట్టు ఎంపికల్లో తుమ్మడం పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. క్రీడల్లో విద్యార్థినులు చూపుతున్న ప్రతిభ అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయిలోనూ రాణించాలని వారు ఆకాంక్షించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram