Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

MSN ఫార్మా కంపెనీకి అక్రమ పర్మిషన్లపై విచారణకు డిమాండ్-పంచాయతీరాజ్ కమిషనర్ కి ఫిర్యాదు

November 18, 2026 · 1 week క్రితం
◉ 17 Views ↗ 0 Shares

చిన్న శంకరంపేట (రా) నవజ్యోతి ప్రతినిధి:
చిన్న శంకరంపేట (రా ):చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఉన్న MSN కంపెనీకి అక్రమంగా పర్మిషన్లు ఇచ్చారంటూ గ్రామస్థులు పంచాయతీరాజ్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామ పూర్వపు కార్యదర్శి పద్మ సెక్రటరీ పాలన సమయంలో గ్రామసభ పెట్టకుండానే గ్రామ ప్రజలకు తెలియకుండా వార్డు సభ్యులకు ఎవరికి తెలియకుండా తన సొంత నిర్ణయంతో MSN ఫార్మా కంపెనీకి 12 బ్లాకులకు అనుమతులు ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ నేడు హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తాటికొండ రామకృష్ణ, గరిగే నర్సింలు, శేరి స్వామి, డోలి నరేష్, నర్ర భూపాల్, గ్రామస్తులు శేరి చిన్న స్వామి, గాజుల నవీన్ గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram