Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నల్గొండ

ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే బియల్ఆర్

November 22, 2026 · 6 days క్రితం
◉ 5 Views ↗ 0 Shares

అడవిదేవులపల్లి, నవంబర్ 22 (నవజ్యోతి ప్రతినిధి): మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించి, ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం అందేలా నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా అందించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram