బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
నర్సాపూర్ నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
కూల్చారం:కుల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన మంగలి నర్సమ్మ కుటుంబానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నర్సమ్మ వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం కోసం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సునీతమ్మను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3,25,000/- (మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు) విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. తన కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రాన్ని క్యాంపు కార్యాలయంలో స్వయంగా అందజేసి భరోసా కల్పించారు. పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఆపద సమయంలో ఆదుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు, సంతోషం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.






