Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

ఎమ్మెల్యే చొరవతో బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

November 17, 2026 · 2 weeks క్రితం
◉ 7 Views ↗ 0 Shares

రామాయంపేట : ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి బాధితులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది.మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు చొరవతో రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామానికి చెందిన కట్ట కిష్టయ్యకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.34 వేల ఆర్థిక సాయం మంజూరైంది. ఈ మేరకు మంజూరైన చెక్కును గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా బాధితుడికి అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.అర్హులైన బాధితులు సీఎంఆర్‌ఎఫ్ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా, కాంగ్రెస్ గ్రామకమిటీ అధ్యక్షుడు గడీల నగేష్, మాజీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి,కుమార్, సిద్ధారాములు,రాజు,నరేష్,ఎల్లం,కాట్రియాల్ సిద్ధారాములు,బాలయ్య,శ్యాములు,కట్టరాజు తదితర కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram