Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

పదేళ్ల నిరీక్షణకు తెర- ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు-సర్పంచ్ సంతోషనవీన్

November 17, 2026 · 2 weeks క్రితం
◉ 12 Views ↗ 0 Shares

చిన్న శంకరంపేట(రా) నవజ్యోతి ముకుంద్:
చిన్న శంకరం పేట(రా):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పింఛన్లలో భాగంగా రుద్రారం గ్రామానికి 26 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో, సర్పంచ్ ఆకుల సంతోష నవీన్ కుమార్, ఉప సర్పంచ్ పుల్ల గళ్ళ నర్సింలు , పాలకవర్గం, కాంగ్రెస్ శ్రేణుల కృషితో ఈ పింఛన్లు మంజూరయ్యాయి.వీటిలో వికలాంగులు,వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్లు ఉన్నాయి.గత పదేళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇవి ఎంతో అండగా నిలవనున్నాయి.ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేదలకు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రావులకు సర్పంచ్ నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram