లక్ష్మీ దేవునిపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన
◉ 11 Views
↗ 0 Shares
బిక్కనూర్, నవంబర్ 22 (నవజ్యోతి ప్రతినిధి): మండలంలోని లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో ఆదివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సర్పంచ్ లింగారెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు తిమ్మారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు బాపిరెడ్డి, అనిల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పరమేశ్వర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






