Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేదలకు భరోసా-ఆరెగూడెంలో ఆసరా పింఛన్లు

November 16, 2026 · 2 weeks క్రితం
◉ 5 Views ↗ 0 Shares

వెల్దుర్తి నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
వెల్దుర్తి :ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కొత్త పింఛన్ల కోసం ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపికబురు అందించింది.కొత్త పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది.మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన 10 మంది అర్హులైన పేదలకు కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయి.పింఛన్లు రావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా NSUI నాయకులు కుస్తీ రవితేజ మాట్లాడుతూ… నిరుపేదల కష్టాలను గుర్తించి కొత్త పింఛన్లు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర మంత్రి, మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి కి, మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని అన్నారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram