భిక్కనూరు, సెప్టెంబర్ 26 (నవజ్యోతి ప్రతినిధి): భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన 26 ఏళ్ల మహిళ అదృశ్యమైనట్లు భిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. షేక్ పర్వేజ్ తన భార్య సుమయ్య బేగం కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పర్వేజ్‌కు సుమయ్య బేగంతో సుమారు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సెప్టెంబర్ 26న ఉదయం సుమారు 8 గంటలకు పర్వేజ్ ప్లంబింగ్ పనికి వెళ్లగా, సుమయ్య బేగం ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సుమారు 2 గంటలకు భోజనం కోసం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె కనిపించలేదు.
ఆమె కోసం బంధువుల ఇళ్లతో పాటు తెలిసిన ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి ఆమె ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అదృశ్యమైన మహిళ వివరాలు:
పేరు: సుమయ్య బేగం
వయస్సు: 26 సంవత్సరాలు
స్వస్థలం: డెగ్లూర్, మహారాష్ట్ర
ఎత్తు: సుమారు 5.2 అడుగులు
శరీర ఛాయ: గోధుమ రంగు
ముఖం: గుండ్రటి ముఖం
భాష: హిందీ
ఇంటి నుంచి వెళ్లే సమయంలో: నల్లరంగు బురఖా
సుమయ్య బేగం ఆచూకీ తెలిసిన వారు, ఆమెను ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్ఐ, ఎస్హెచ్ఓ ఎస్. అనిల్ కోరారు. మహిళ ఆచూకీ గుర్తించేందుకు పోలీసులకు సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.