Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
సంగారెడ్డి

రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలి

November 23, 2026 · 5 days క్రితం
◉ 7 Views ↗ 0 Shares

– పోతిరెడ్డిపల్లిలో నేషనల్ హైవే పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకుడు పొన్నం శంకర్ రెడ్డి

సంగారెడ్డి : పోతిరెడ్డిపల్లి వద్ద చేపడుతున్న నేషనల్ హైవే విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలని కాంగ్రెస్ నాయకుడు పొన్నం శంకర్ రెడ్డి కోరారు. సోమవారం పోతిరెడ్డిపల్లిలో జరుగుతున్న రహదారి విస్తరణ పనుల ప్రాంతాన్ని సందర్శించి మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనులు సజావుగా సాగేందుకు స్థానిక ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణ ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజల సహకారం కీలకమని తెలిపారు. రోడ్డు విస్తరణ వల్ల భవిష్యత్తులో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని అన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పొన్నం శంకర్ రెడ్డి కోరారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram