బెస్ట్ సీఈఓ అవార్డు అందుకున్న సీత శ్రీనివాస్
భూదాన్ పోచంపల్లి: పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పురస్కారాన్ని సొంతం చేసుకుంది. బ్యాంకు సీఈఓ సీత శ్రీనివాస్ బెస్ట్ సీఈఓ అవార్డును అందుకున్నారు. ఈ ప్లస్ ఇంటలెక్చువల్ మీడియా ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 26 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ కార్నివాల్ అండ్ ఐకానిక్ లీడర్స్ అవార్డ్స్–2026లో భాగంగా నవంబర్ 27న జరిగిన ప్రధానోత్సవంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ తడక రమేశ్ మాట్లాడుతూ.. బ్యాంకులో ప్రస్తుతం రూ.405.38 కోట్ల డిపాజిట్లు, రూ.292.33 కోట్ల రుణాలు ఉన్నాయని తెలిపారు. బ్యాంకును మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని, సమర్థవంతమైన సేవలందిస్తూ అవార్డు అందుకున్న సీఈఓ సీత శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.
సీఈఓ సీత శ్రీనివాస్ మాట్లాడుతూ.. జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు ధీటుగా ఆధునిక సేవలు అందిస్తున్నామని, ప్రతి నెల మూడవ శనివారం అన్ని శాఖల్లో ఖాతాదారులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ఓటీపీ, పాస్వర్డ్ భద్రత, డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, పాలకమండలి సభ్యులు, ఏజీఎం రాచకొండ మధుసూదన్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస శాస్త్రి, ఐటీ హెడ్ చెరుపల్లి నీరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు వ్యవస్థాపకులు, మాజీ పాలకమండలి సభ్యులు, ఖాతాదారులు, వాటాదారులు, మేనేజర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ సీత శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.






