Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మేడ్చల్ మల్కాజిగిరి

తైక్వాండోలో పతకాల పంట.. ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం!

November 28, 2026 · 10 minutes క్రితం
◉ 0 Views ↗ 0 Shares

కుత్బుల్లాపూర్, నవంబర్ 28 (నవజ్యోతి ప్రతినిధి):
ప్రగతినగర్‌కు చెందిన 18 ఏళ్ల తైక్వాండో క్రీడాకారిణి పుష్పిత సాయిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘనంగా సన్మానించారు. రచ్చ చక్రధర్ ఆధ్వర్యంలో నిజాంపేట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రతిభను అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన పుష్పిత భవిష్యత్తులో కామన్వెల్త్, ఒలింపిక్స్‌లోనూ స్వర్ణాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఈటల ఆకాంక్షించారు. తగిన ప్రోత్సాహం, సహకారం లభిస్తే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని పుష్పిత తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, క్రీడాకారులు, స్థానికులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram