అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం..
నిజాంసాగర్, నవ జ్యోతి నవంబర్ 27,నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించి, లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పిస్తూ, వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, గ్రామ సర్పంచ్ బొజ్జ అంజయ్య, నాయకులు బంగ్లా ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






