Friday, November 27, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మేడ్చల్ మల్కాజిగిరి

బోడుప్పల్‌లో రూ.40 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన

November 27, 2026 · 29 minutes క్రితం
◉ 2 Views ↗ 0 Shares

బోడుప్పల్, నవంబర్ 27:
బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని రెండు డివిజన్
లో రూ.40 లక్షల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. చెంగిచెర్ల డివిజన్ శ్రీలక్ష్మి నగర్ కాలనీలో రూ.30 లక్షలతో నూతన రోడ్డు నిర్మాణ పనులను, బోడుప్పల్ డివిజన్ వీరారెడ్డి నగర్‌లో రూ.10 లక్షలతో పార్క్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ డివిజన్ అధ్యక్షుడు పొగుల నరసింహారెడ్డి,బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడు బొమ్మక్ కళ్యాణ్,చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షుడు పొగుల దిలీప్ రెడ్డి, పులకండ్ల జంగారెడ్డి,వెంకటేష్ గుప్తా,తోటకూర రవీందర్ యాదవ్, జై రాములు యాదవ్, యాకూబ్, అసర్ల బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram