Friday, November 27, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

తెలంగాణ ఉద్యమకారుడు చిలువేరు బాలనరసింహ కుటుంబంలో తీవ్ర విషాదం.. సతీమణి స్వప్న కన్నుమూత

November 27, 2026 · 11 hours క్రితం
◉ 13 Views ↗ 0 Shares

భూదాన్ పోచంపల్లి:
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని మెహర్ నగర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు బాలనరసింహ సతీమణి చిలువేరు స్వప్న శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని కుటుంబ సభ్యులు ఆశించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.
స్వప్న మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కన్నీరుమున్నీరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన బాలనరసింహ కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతితో మెహర్ నగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, పార్టీ శ్రేణులు స్వప్న మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ బాలనరసింహ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram