Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత..

November 25, 2026 · 2 days క్రితం
◉ 3 Views ↗ 0 Shares

– బాధిత కుటుంబానికి అండగా గ్రామ ప్రజాప్రతినిధులు

భూదాన్ పోచంపల్లి : మండల పరిధిలోని
గౌస్ కొండ గ్రామానికి చెందిన మర్రి సత్తిరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కును గ్రామ ప్రజాప్రతినిధులు అందజేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉప్పునూతుల వెంకటేష్ యాదవ్ సహకారంతో మంజూరైన ఈ చెక్కును గ్రామ సర్పంచ్ మునుకుంట్ల నరేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దోసపాటి రవి చేతుల మీదుగా మర్రి సత్తిరెడ్డికి అందించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మునుకుంట్ల నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తోందని అన్నారు. అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉప్పునూతుల వెంకటేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram