తెలంగాణ ఉద్యమకారుల మండల అధ్యక్షుడిగా పోనమోని శ్రీశైలం ఏకగ్రీవ ఎన్నిక
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 24(నవ జ్యోతి ప్రతినిధి):
తెలంగాణ ఉద్యమకారుల సంఘం భూదాన్ పోచంపల్లి మండల నూతన అధ్యక్షుడిగా పోనమోని శ్రీశైలం ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పురపాలక కేంద్రంలోని మహమ్మాయి దేవాలయంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బహుజన ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. సంఘం అధ్యక్షుడిగా పోనమోని శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా ముసునూరు యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా చింతకింది కిరణ్, సహాయ కార్యదర్శిగా కొంక లక్ష్మీనారాయణ, కోశాధికారిగా పగడాల సత్యనారాయణ, కార్యదర్శిగా ఐతిరాజు బిక్షపతి, ప్రచార కార్యదర్శులుగా బూడిద మారయ్య, కూరపాటి బాబు ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా మెరుగు శశికళ, పోన మౌనికృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా నల్ల లక్ష్మణ్, గౌరవ సలహాదారులుగా బైరు రామాంజనేయులు, బొంగు ఐలయ్య తదితరులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పోనమోని శ్రీశైలం మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, ఐక్యత, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు.






