Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నల్గొండ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

November 19, 2026 · 1 week క్రితం
◉ 8 Views ↗ 0 Shares

మాడుగులపల్లి, నవంబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి) మండల పరిధిలోని ఇస్కాభావిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మొల్లాల వెంకట్‌రెడ్డి మృతి చెందిన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి బుధవారం ఆయన నివాసానికి స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, మాజీ చైర్మన్ జెరిపోతుల రాములుగౌడ్, ఉపసర్పంచ్ వల్లపుదాసు సంధ్య చంద్రశేఖర్, గ్రామ శాఖ అధ్యక్షుడు తంగెళ్ల సీతారాంరెడ్డి, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram