చలో సిద్దిపేట- పేదలకు భరోసా ఇందిరమ్మ బీమా- ఆవుల రాజిరెడ్డి
నర్సాపూర్ నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
నర్సాపూర్:సిద్దిపేటలో ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు.నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిపి సుమారు 5 వేల మందితో సిద్దిపేటకు తరలివెళ్తామని తెలిపారు.ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ఇందిరమ్మ కుటుంబ బీమా కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నారని, ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కల్పిస్తుందన్నారు.ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. పేదల జీవితాల్లో ఇందిరమ్మ రాజ్యం లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెలుగులు నింపుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివన్నగారి ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.






