ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు-ఆవుల రాజిరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కుకునూర్ గ్రామానికి శుభవార్త అందింది.నర్సాపూర్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో కుకునూర్ గ్రామానికి 32 కొత్త చేయూత పింఛన్లు మంజూరు అయ్యాయి.నర్సాపూర్ లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం లో పేదల సంక్షేమమే తమ లక్ష్యమని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
పింఛన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
తమకు అండగా నిలిచిన ఆవుల రాజిరెడ్డి గారికి గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ రాష్ట్ర ఫిషర్ మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్ గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






